Mega Celebration on “Peddi” Sets as the Boss Arrives: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న వేళ, సెట్స్‌లో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచారు.

గురువుతో కలిసి బాస్ సందడి

మెగాస్టార్‌తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా సెట్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌లో చిరంజీవి సందడి చేసిన వీడియోను దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "పెద్ది సెట్స్‌లో నా బాస్ మరియు నా గురువు. ఇది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. పెద్ది సినిమా స్ఫూర్తితో నేను కూడా కొంచెం కండలు పెంచాను" అంటూ బుచ్చిబాబు సరదాగా పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో చిరంజీవి నవ్వుతూ యూనిట్ సభ్యులతో ముచ్చటించడం, చరణ్, బుచ్చిబాబులు తమ కండలను చూపిస్తూ బాస్‌ను నవ్వించడం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రికార్డుల వేటలో పెద్ది

ఒకవైపు షూటింగ్ హడావిడి సాగుతుండగానే, మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం.. యూఎస్ ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే 100K డాలర్ల మార్కును దాటి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా పెద్ది సరికొత్త రికార్డు సృష్టించింది. నేడు మేకర్స్ ఈ సినిమా ఫైనల్ ఎడిట్ కాపీని లాక్ చేశారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story