రామ్ చరణ్ వినాయక చవితి వేడుకలు

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు సానాల కలయికలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి ఓ పాటతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'పెద్ది' టీమ్‌తో కలిసి రామ్ చరణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వీడియోలో రామ్ చరణ్ "హ్యాపీ గణేష్ చతుర్థి" అని చెప్పగానే.. సినిమా యూనిట్ సభ్యులు ఉత్సాహంగా గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యం సినిమా టీమ్‌లో ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది.

రెహమాన్ డప్పు, చరణ్ స్టెప్పు

దర్శకుడు బుచ్చిబాబు తన ట్వీట్‌లో ‘‘రెహమాన్ గారి డప్పు... రామ్ చరణ్ గారి స్టెప్పు.. నన్ను నమ్మండి... ఇది మెగా పవర్ బ్లాస్ట్’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు. రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ డ్యాన్స్ కలగలిస్తే వెండితెరపై ఒక మెగా పవర్ బ్లాస్ట్ చూడవచ్చని బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పాట చిత్రీకరణ ప్రారంభం కావడంతో సినిమా నిర్మాణం వేగవంతం కానుంది. 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story