Mega Power Star Ram Charan: నాకు మగధీరలా.. రోషన్ కు చాంపియన్: చరణ్
రోషన్ కు చాంపియన్: చరణ్

Mega Power Star Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న హైదరాబాద్‌లో జరిగిన 'చాంపియన్' (Champion) చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
రోషన్ తనకు సొంత తమ్ముడితో సమానమని చరణ్ అన్నారు. "మా నాన్నకు శ్రీకాంత్ గారు ఎంత సన్నిహితమో, నాకు రోషన్ కూడా అంతే. వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఏ శుభకార్యానికైనా నేను ఉండాల్సిందే" అని తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
'చాంపియన్' ట్రైలర్ చూస్తుంటే తనకు మగధీర సినిమా గుర్తుకు వచ్చిందని, అదొక క్లాసిక్ ఫిల్మ్‌లా అనిపిస్తోందని ప్రశంసించారు. రోషన్ కెరీర్‌లో ఈ సినిమా ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.ఈ మూవీ పోస్టర్స్ లో రోషన్ ఓ హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ సినిమా యాక్షన్ హీరోలా చాలా అందంగా ఉన్నాడన్నారు.ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' గురించి క్లారిటీ ఇచ్చారు.'పెద్ది' సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందని, ఈ చిత్రం 2026, మార్చి 27న విడుదలవుతుందని అధికారికంగా ధృవీకరించారు. సినిమా వాయిదా పడుతుందనే వదంతులకు ఆయన చెక్ పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు వచ్చిన తర్వాత మార్చిలో 'పెద్ది' సందడి ఉంటుందని చమత్కరించారు.
చాంపియన్ బ్రిటీష్ పాలన కాలంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. ఒక యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్వీన్ ఎలిజబెత్‌ను కలవాలనే లక్ష్యంతో సాగించే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. రోషన్ సరసన అనస్వర రాజన్ నటిస్తోంది. నందమురి కళ్యాణ్ చక్రవర్తి చాలా కాలం తర్వాత ఈ సినిమాతో వెండితెరపైకి వస్తున్నారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న విడుదల కానుంది.

