Ram Charan’s “Peddi”: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది! గత కొన్ని రోజులుగా 'పెద్ది' సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ను దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ప్రకటించేశారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. అదేంటంటే.. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పాడు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోతోంది.

అంతేకాదు, బుచ్చిబాబు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందని, ఆ షూటింగ్ స్పాట్ నుంచి తాను నేరుగా ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే సినిమా పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత బుచ్చిబాబుతో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story