చిరు,వెంకీ స్టెప్స్ అదుర్స్

Mega Victory Mass Release: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన క్రేజీ మాస్ సాంగ్ 'మెగా విక్టరీ మాస్' ఘనంగా విడుదలయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా నుంచి ఈ మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగ మూడ్‌ను తెచ్చేలా ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ పాటను లాంచ్ చేశారు.

ఏందీ బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి" అంటూ సాగే ఈ మాస్ నంబర్‌ను కాసర్ల శ్యామ్ రాశారు. భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్‌తో అదిరిపోయే ట్యూన్ అందించారు.నకాష్ అజీజ్, విశాల్ దడ్లానీ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో ఈ పాటకు మరింత జోష్ ఇచ్చారు. విజయ్ పోలకి కొరియోగ్రఫీలో చిరంజీవి గ్రేస్, వెంకటేష్ ఎనర్జీ కలిసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉన్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ ఒక కీలకమైన 'ఎక్స్‌టెండెడ్ కేమియో'పాత్రలో కనిపిస్తున్నారు.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story