Megastar Chiranjeevi, Nayanthara, Anil Ravipudi, Sahu Garapati, Sushmita Konidela,Mega157 Second Schedule Begins in Mussoorie

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో Mega157తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ఇప్పటికే ముగించింది టీమ్. ఈ షెడ్యూల్‌ లో చిరంజీవి పాల్గొన్నారు. రషెస్ అద్భుతంగా ఉన్నాయి. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్.

మెగా157 రెండవ షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. 10 రోజుల షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్, తదితరులు ప్రధాన తారాగణం పాల్గొంటారు. చిత్ర బృందం కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ తర్వాత నయనతార చిరుతో కలిసి మూడోసారి నటించనుంది.

మెగాస్టార్ చిరంజీవి ఒక స్కూల్ గ్రౌండ్ లో టేబుల్ మీద కూర్చోని వుండగా, పిల్లలు తనవైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్‌ అప్‌ ఇస్తూ ప్రజెంట్ చేసిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ విజువల్ చాలా ప్లజెంట్ గా వుంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం మరింత జాయ్ ని యాడ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది.

ఇటీవల వచ్చిన ఫెస్టివల్ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్రేడ్‌మార్క్, క్రియేట్ ప్రమోషన్స్ తో #Mega157పై ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

Politent News Web3

Politent News Web3

Next Story