Megastar Chiranjeevi at the success meet of blockbuster Kubera

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జున గారు ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమాఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున గారుప్పుకొని చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాను. దేవ క్యారెక్టర్ లో ధనుస్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నా శేఖర్ కమ్ముల. స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల పాత్రలు కూడా దేవ దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం. నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది. మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన దోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్ గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది లో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు .అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం. సునీల్ గారి నాన్నగారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్ లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్ లో జాన్వి ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వి తో ఒక సినిమా చేస్తాను(నవ్వుతూ) వారు కుబేర లాంటి మరెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డిఓపి నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ యంగ్స్టర్స్ ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి. ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కం బ్యాక్ లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్ గా ఉంది. అది దేవిశ్రీ రికార్డింగ్ లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150 లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ వుంటే ఆడియన్స్ ధియేటర్స్ కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది.ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దొరుకుతుంది. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్'అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. విక్రమ్ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఎక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు. అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్ తో హ్యూమన్ ఎమోషన్ తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో దీపక్ దేవా సమీరా ఇలా అన్ని పాత్రలే తప్పా స్టార్స్ కనిపించరు. ఈ సినిమా దేవ సినిమా.. దీపక్ సినిమా.. సమీరా సినిమా.. కుష్బూ సినిమా... ఇట్స్ బిలాంగ్స్ టు శేఖర్ కమ్ములు. ఆయనకి థాంక్యూ నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో నేర్పించారు(నవ్వుతూ) నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి గారు వచ్చేటప్పుడు కార్లో చెప్పారు 'చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు' అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు .సునీల్ గారు నాకు బ్రదర్ లాంటివారు. రామ్మోహన్ గారు జాన్వి అందరూ చాలా వెరీ స్వీట్ పర్సన్స్. నికిత్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవిశ్రీ మ్యూజిక్ ఫెంటాస్టిక్. ఈ సినిమా మీడియాకు నచ్చింది. ఆడియన్స్ కి నచ్చింది. ఎక్కడ కూడా మూడు రేటింగ్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి మిరాకిల్ ని శేఖర్ క్రియేట్ చేశాడు. ధనుష్ ని సెట్ లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్ లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మికని చూస్తే క్షణక్షణం లో శ్రీదేవి గారి గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సినిమా నాలు వరల్డ్ ని ఓపెన్ చేసింది. మరో 40 ఏళ్ళు తిరుగుండదు. ఐ లవ్ యు ఆల్'అన్నారు.

హీరో ధనుష్ మాట్లాడుతూ .. అందరికి నమస్కారం ఇది. ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక సినిమాకి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. అది ఈ సినిమాకి జరిగింది. ఈ విషయంలో మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ దేవుడిచ్చిన సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలు. యాక్షన్, బ్లాస్టింగ్స్ ఉన్న సినిమాలే థియేటర్స్ లో ఆడుతున్నాయని అలాంటి సినిమాలకే థియేటర్స్ జనాలకి వస్తున్నారని ఒక వాదన ఉంది. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని ధియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు. ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ గ్రాండియర్. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు. తమిళ్ లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది. ముందు నిర్మాత మొహంలో ఆనందం చూసి సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పొచ్చు అని మా నాన్న చెప్పేవారు. మా నిర్మాతలు ఆనందంగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చిరంజీవి గారు వచ్చి మా టీం కి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మెగా సక్సెస్. చిరంజీవి గారు నాగార్జున గారి సమక్షంలో మాట్లాడడం అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్ భావిస్తున్నాను. సినిమాని నెక్స్ట్ లోనికి తీసుకెళ్లి ఆడియన్స్ కి చేరువ చేసిన మీడియాకి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. చిరంజీవి గారు నా లక్కీ చార్మ్. ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కాలేజ్ డేస్ లో ఆయనని కలిసాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను ఆయన్ని డైరెక్ట్ చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి మొదలైన జర్నీ 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన్ని మొన్న కలిసాను. అక్కడి నుంచి ఈ సినిమాకి ఒక యుఫోరియా స్టార్ట్ అయింది. చిరంజీవి గారు ఎప్పుడు కూడా బయట వ్యక్తిలా అనిపించరు. కుబేర కి ఆడియన్స్ ఇచ్చిన స్థానాన్ని స్థాయిని మర్చిపోలేను. ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఒక ఫిలిం మేకర్ కి గొప్ప బలాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన ప్రశంసలు అందించిన మీడియా కి ధన్యవాదాలు. చాలా పెద్ద కాన్వాస్ లో తీసిన సినిమా ఇది. ఈ సినిమాల్లో దీపక్ పాత్రని ఒప్పుకున్న నాగార్జున గారికి ధన్యవాదాలు ఆయన పెర్ఫార్మన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఆయన పర్ఫామెన్స్ ని చూస్తున్నప్పుడు నాకే కళ్ళల్లో నీరు తిరిగాయి. ధనుష్ గారి గురించి ఒకటే మాట చెప్పాలి. గాడ్ లైక్ పెర్ఫార్మెన్స్. పోయిరా మామ సాంగ్ చూసి నాకే పూనకాలు వచ్చాయి. మా అమ్మగారు ఈ సినిమాను చూసి ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండేది. దేవ దీపక్ చాలా అద్భుతంగా చేశారని చెప్పింది. రష్మిక సమీరా పాత్రలో అద్భుతంగా పెర్ఫాం చేసింది.దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి తెలుగు తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాము. అలా రెండు భాషల్లో రీ రికార్డింగ్ చేయడం పాటలు చేయడం అనేది మామూలు విషయం కాదు. డిఓపి నికేత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని ఫస్ట్ సైన్ చేసింది నారాయణ్ దాస్ గారు. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా మీద ఉంటాయి, సునీల్ గారికి రామ్మోహన్ గారికి జాహ్నవి గారికి థాంక్యూ. ఎంత బడ్జెట్ అయినా మాకు సపోర్ట్ ఇచ్చారు. వారి వలన ఇది పాజిబుల్ అయింది. మా అమిగోస్ టీం కి థాంక్యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. లవ్ యూ చిరంజీవి గారు. మంచి సినిమాని భుజాన వేసుకొని ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. మా మ్యూజిక్ టీంకి పేరుపేరునా థాంక్ యూ. నందకిషోర్ చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. ఆయన ప్రతిభ అందరికీ తెలియాలి. భాస్కర్ భట్ల, చంద్రబోస్ గారికి థాంక్ యూ. నికేత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. నిర్మాత సునీల్ నారంగ్ గారు అద్భుతం. ఆయన స్టూడియోకి వస్తే చాలా సందడిగా వుంటుంది. సినిమా రిలీజ్ కు ముందే మొత్తం పేమెంట్ ఇచ్చేశారు(నవ్వుతూ). సమీర పాత్రలో రష్మిక అద్భుతంగా చేసింది. తన విజయాల్ని కొనసాగించడం ఆనందంగా వుంది. ఈ కథని ధనుష్ గారు ఒప్పుకోవడమే సక్సెస్. ఈ సినిమాతో ఆయనకి మరో నేషనల్ అవార్డ్ వస్తుంది. నాగ్ సర్ ఎవర్ గ్రీన్ మన్మధుడు. ఇందులో దీపక్ పాత్ర ఆయన తప్పితే మరొకరు చేయలేరు. శేఖర్ గారు అద్భుతంగా సినిమా తీశారు. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది'అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చిరు గారు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. థాంక్ యు సర్. ఈ సినిమా కథ విన్న తర్వాత సెట్స్ వెళ్లి డైరెక్టర్ గారికి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఎలా చెబితే అలా పెర్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు సమీర పాత్రకు వచ్చిన క్రెడిట్ డైరెక్టర్ గారికే దక్కుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం. ధనుష్ గారు నాగార్జున గారు శేఖర్ గారు ఈ సినిమాకి పిల్లర్స్. దేవిగారు మ్యూజిక్ తో మరో లెవల్ కి తీసుకెళ్ళారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు'అన్నారు.

నిర్మాత పుష్కర్ రాం మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి గారికి థాంక్ యూ. మంచి సినిమాకి ఆయన సపోర్ట్ ఎప్పుడూ వుంటుంది. లవ్ స్టొరీ సినిమా అప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు కుబేర వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు'అన్నారు.

ప్రొడ్యూసర్ జాహ్నవి నారంగ్ మాట్లాడుతూ... ముందుగా మా తాత గారిని స్మరించుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు ఆయన ఆశీస్సులతో మొదలైంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకి విచ్చేసిన చిరంజీవి గారికి థాంక్యూ. కుబేర మెగా బ్లాక్ బస్టర్ అయిందని భావిస్తున్నాను. చిరంజీవి గారు మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి ముందుంటారు. శేఖర్ గారితో వర్క్ చేయడం ఒక స్కూల్ కి వెళ్ళినట్టే ఉంటుంది. దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రశ్మిక గారు సమీర పాత్రలో ఒదిగిపోయారు. దీపక్ పాత్రలో నాగార్జున గారు పెర్ఫార్మెన్స్ మాస్టర్ క్లాస్. దేవా పాత్రలో ధనుష్ గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు'అన్నారు.

డిఓపి నికేత్ బొమ్మి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా కోసం అన్ని డిపార్ట్మెంట్స్ అద్భుతంగా చేశాయి. ఈ సెలబ్రేషన్స్ లో చిరంజీవి గారు భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ధనుష్ గారు, నాగార్జున గారు గారితో కలిసి వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద కాన్వాస్ ఇచ్చిన శేఖర్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు

ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. నాగార్జున గారు ధనుష్ గారు అద్భుతంగా నటించారు. అలాంటి లొకేషన్స్ లో నటించడం చాలా కష్టం. చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశాను. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా శేఖర్ గారికి దక్కుతుంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు. అందరికీ థాంక్యు'అన్నారు

కో రైటర్ చైతన్య పింగళి మాట్లాడుతూ.. చిరంజీవి గారు నా హీరో. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది శేఖర్ డ్రీం. దీనికి మేము వర్క్ చేసాం. ఇందులో యాక్టర్స్ అందరినీ పాత్రల పేర్లతోనే సెట్లో పిలిచేవాళ్ళం. వాళ్లు కూడా అలానే ఉండేవారు. నాగార్జున గారు ధనుష్ గారు రష్మిక గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. శేఖర్ కమ్ముల గారికి థాం.క్యూ అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు

లిరిక్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కుబేర టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను పాటలు రాయడం ఆ పాటలకి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ దీవెనపాటి విని చాలామంది అమ్మ గుర్తొచ్చింది అని చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మలందరి నోటి చలవ ఈ పాట. ఇందులో పాటలన్నీ శేఖర్ గారు నా చేత రాయించారు. ఆలోచనలన్నీ ఆయనవే. దేవిశ్రీప్రసాద్ గారికి, పాటలు పాడిన సింగర్లందరికీ థాంక్యూ. నాగార్జున గారిని ధనుష్ గారిని ఇలా ఎదురుగా చూస్తానని అనుకోలేదు. అందరికీ థాంక్యు'అన్నారు.

లిరిక్ రైటర్ భాస్కరభట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో మంచి పాట రాసే అవకాశం వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుం.ది దీనికి కారణం సినిమాలో ఆ సీక్వెన్స్ సందర్భం. అందుకే పాట అంతా అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమాకి శేఖర్ గారు చేయడం గొప్ప అనుభవం. ఆయన దగ్గర్నుంచి ఓపిక ఉండటం నేర్చుకున్నాను ఆయనతో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా రేంజ్ రోజుకి పెరుగుతోంది. థియేటర్స్ అన్ని కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలో నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది'అన్నారు. సినిమా యూనిట్ అంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Politent News Web3

Politent News Web3

Next Story