నేను చేసిన మంచే మాట్లాడుతుంది

Megastar Chiranjeevi: పొలిటిక్ రీ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఫినిక్స్ వైద్యశిబిరంలో మాట్లాడిన చిరంజీవి.. కొందరు తనపై సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుస్తున్నారని..వాటిని తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు. తనపై విమర్శలు చేస్తే..రాజమండ్రిలో ఓ మహిళ అడ్డుకుని నిలదీసిందన్నారు. తాను మాట్లాడాల్సిన అవసరం లేదని.. తాను చేసిన మంచి పనులే సమాధానం చెబుతాయన్నారు.

తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, కేవలం సినిమాలపైనే దృష్టి పెడుతున్నానని పలు సందర్భాల్లో చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవల తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని, తన ఆశయాలను ఆయనే ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పారు. అయితే జనసేన కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని, బీజేపీతో దీనిపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తరచూ రాజకీయ నేతలతో భేటీ అవుతుండటంతో ఇలాంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాని మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండటం వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు

PolitEnt Media

PolitEnt Media

Next Story