మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్ నయనతార జాయిన్ అయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముసోరిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో కనిపించనుంది, ఆమె ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ రోజు నుండి నయనతార షూటింగ్‌లో పాల్గొనడం ప్రారంభించారు. ఉత్తరఖండ్ లోని ముసోరి సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతుండగా, చిరంజీవి,నయనతారల కాంబినేషన్ సన్నివేశాలు తెరపై ఆకట్టుకునేలా ఉండనున్నాయని సమాచారం.

అనిల్ రావిపూడి యాక్షన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం చిరంజీవి ఫ్యాన్స్‌తో పాటు నయనతార అభిమానులకు కూడా పెద్ద ట్రీట్ కానుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story