‘Chiru Kaka’: మెగాస్టార్ బర్త్‌డే సర్ ప్రైజ్: చిరు కాకా.. సంక్రాంతికి బాక్సాఫీస్ షురూ
సంక్రాంతికి బాక్సాఫీస్ షురూ

‘Chiru Kaka’: టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి మరో పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'మెగా 158' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో చిరంజీవి ఆక్వా సంస్థలో 'కె. సత్యం' అనే మధ్యతరగతి సూపర్ వైజర్ పాత్రలో నటిస్తున్నారు. 'ఇది సత్య మాట.. ఇంకా డౌటా' అంటూ ఆయన చెప్పే డైలాగ్ పాత్ర స్వభావాన్ని చాటుతోంది. ఇక కీ చైన్‌తో కూడిన తాళంచెవి యాక్సిడెంటల్ స సన్నివేశం తర్వాత, ఒక్కసారిగా యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేల్చుతూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజు వింటేజ్ చిరును కళ్లకు కడుతోంది. ఎస్. థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా రెండు విభిన్న కోణాలతో సాగనుంది. సరికొత్త మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ 'కాకా' చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతి ట్రీట్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతుంది!

