Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే! ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. మే మూడో వారంలో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలకమైన టాకీ పార్ట్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్.. తాజాగా పొలాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. అక్కడ చిరంజీవి మరియు ఇతర నటీనటులపై ఇంపార్టెంట్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గురువారం థియేటర్లలోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ సందర్భంగా.. Mega 158 టీమ్ పొలాచ్చి లోకేషన్ నుంచే స్పెషల్ గా బెస్ట్ విషెస్ తెలియజేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను షూటింగ్ నిమిత్తం పొలాచ్చిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ సినిమాపైనే ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టానికి, ఇండస్ట్రీ పడ్డ శ్రమకు సక్సెస్ రూపంలో అద్భుతమైన ప్రతిఫలం దక్కిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఒకవైపు కొడుకు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు బాబీ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిరంజీవి కష్టపడుతున్నారు. పొలాచ్చి షెడ్యూల్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story