తెరపైకి మైఖేల్

Michael Jackson Life Story: ప్రపంచ సంగీత ప్రియుల ఆరాధ్య దైవం.. డ్యాన్స్ అంటే ఆయనే, ఆయనే డ్యాన్స్! ఆ గ్లోబల్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మైఖేల్’. తాజాగా విడుదలైన ఈ సినిమా 'ఫైనల్ ట్రైలర్' ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది!

ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక్క క్షణం మైకేల్ జాక్సన్ మళ్ళీ తిరిగి వచ్చాడా అనిపించక మానదు. మైకేల్ పాత్రలో నటించిన ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్.. బాడీ లాంగ్వేజ్ నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకు అచ్చు తన మేనమామను తలపించాడు. ముఖ్యంగా 'థ్రిల్లర్', 'బీట్ ఇట్', 'బిల్లీ జీన్' వంటి ఐకానిక్ పాటల్లోని ఆ హావభావాలు, ఆ సిగ్నేచర్ 'మూన్‌వాక్' విన్యాసాలు చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం!

ఈ సినిమా కేవలం ఆయన విజయాలను మాత్రమే చూపించడం లేదు. ఒక చిన్నారిగా మొదలై గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణం.. ఆ క్రమంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని వివాదాలు మరియు ఆయన లోపల జరిగిన అంతర్గత సంఘర్షణను ఈ ట్రైలర్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించారు.

ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోల్‌మన్ డొమింగో, నియా లాంగ్, మైల్స్ టెల్లర్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆ లెజెండ్ గాథ.. ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story