క్లబ్ లో మిరాయ్

Mirai: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా హీరో తేజ సజ్జా కెరీర్‌లో ఇది మరో పెద్ద విజయం.
మిరాయ్ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వెల్లడించింది.
ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కూడా మంచి వసూళ్లను సాధించింది.ఈ సినిమాతో తేజ సజ్జాను ఒక పాన్-ఇండియా హీరోగా నిలబెట్టిందని సినీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
డే-వైజ్ కలెక్షన్లు:
డే 1: రూ. 27.20 కోట్లు (గ్రాస్)
డే 2: రూ. 28.40 కోట్లు (గ్రాస్)
డే 3: రూ. 25.60 కోట్లు (గ్రాస్)
మొదటి 3 రోజుల్లో: మొత్తం రూ. 81.20 కోట్లు (గ్రాస్)
మొదటి 4 రోజుల్లో: మొత్తం రూ. 91.45 కోట్లు (గ్రాస్)
5 రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది.
