మిరాయ్ ట్రైలర్

Mirai:యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'మిరాయ్' సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. 2 నిమిషాల 58 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ ,విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నారు. శ్రియ శరణ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా కథ పురాణాల నేపథ్యంతో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి సృష్టించిన తొమ్మిది పవిత్ర గ్రంథాలను కాపాడే యోధుల్లో తేజ సజ్జా ఒకరిగా కనిపిస్తాడు. ట్రైలర్‌లో తేజ, మంచు మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. వీఎఫ్ఎక్స్, కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

'మిరాయ్' సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల కానుంది.హను-మాన్" సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తదుపరి భారీ చిత్రం మిరాయ్. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story