మంచు మనోజ్ ఎమోషనల్..

Manchu Manoj: తాజాగా విడుదలైన మిరాయ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తొలిరోజు రూ. 27 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ భావోద్వేగానికి లోనయ్యారు. తనను నమ్మిన దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది..

మనోజ్ మాట్లాడుతూ.. "ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత నా ఫోన్ సక్సెస్ గురించి మోగుతోంది. అభినందనలు వస్తున్నప్పటికీ ఇది నాకు ఒక కలలా అనిపిస్తోంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు దర్శకుడు కార్తిక్‌కు నేను జీవితాంతం రుణపడి ఉంటాను" అని అన్నారు.

గతంలో తాను ఎక్కడికి వెళ్లినా, 'అన్నా సినిమా ఎప్పుడు తీస్తావు? కమ్‌బ్యాక్ ఎప్పుడు?' అని అందరూ అడిగేవారని, బయటకు ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల తెలియని భయం ఉండేదని మనోజ్ తెలిపారు. చాలా సినిమాలు చివరి నిమిషంలో ఆగిపోయాయని, అలాంటి సమయంలో కార్తీక్ తనను నమ్మడం తన అదృష్టమని అన్నారు. "మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు" అని కార్తీక్‌కు మనోజ్ కృతజ్ఞతలు చెప్పారు.

నిర్మాత విశ్వప్రసాద్‌కు ధన్యవాదాలు

తన పిల్లల భవిష్యత్తు గురించి భయం ఉండేదని, కార్తీక్ ఆ భయాన్ని తొలగించారని మనోజ్ తెలిపారు. విశ్వప్రసాద్ లాంటి నిర్మాతతో ఎంతోమంది మనోజ్‌తో సినిమా వద్దు అని చెప్పినా కూడా ఏ మాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ప్రశంసించారు. మిరాయ్ వీఎఫ్ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసిందని మనోజ్ అన్నారు.

చివరగా "ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం. నాపై నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపై వరుస సినిమాలు చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తాను" అని మనోజ్ హామీ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story