Mitra Mandali: నవ్వులే నవ్వులు.. మిత్ర మండలి టీజర్ అదుర్స్
మిత్ర మండలి టీజర్ అదుర్స్

Mitra Mandali: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ ప్రధానపాత్రల్లో నటి స్తోన్న చిత్రం 'మిత్ర మండలి'. కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయేందర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. సత్య, వెన్నెల కిషోర్ నవ్విస్తోన్న ఈ వీడియోను ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ నాన్ స్టాప్ కామిడీతో ప్రతి ఒక్క క్యారెక్టర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ, చమత్కార మైన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక హిలేరియస్ వాతావరణాన్ని సృష్టిస్తు న్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఎండ మండింగ్.. చెమట పుట్టింగ్..' అంటూ క్రికెట్ కామెంటరీ లెవల్‌లో టీజర్ ప్రారంభం కాగా.. బాల్ లేకుండా క్రికెట్ ఆడడం.. కామెంటరీ చెబుతూనే క్యారెక్టర్స్‌ను పరిచయం చేయడం ఆసక్తి పెంచేసింది. 'బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు. రోజూ ఎవరో ఒకరిని వెర్రి వారిని చేస్తారు.' అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉండబోతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా యువతలో ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. నటి నిహారిక ఎన్ ఎం సాలిడ్ పాత్రలో కనిపించగా. ఈ గ్యాంగ్లో వీటీవి గణేశ్ కు ఏదో క్లాష్ ఉంటుందనిపిస్తుంది. ఆయన పై చూపించిన కొన్ని పేరడీ సన్నివేశాలూ బాగున్నాయి. టాలీవుడ్ స్టార్ కమిడియన్స్ అందరిని ఈ మూవీలో గ్యాదర్ చేశాడు దర్శకుడు.
