కీరవాణి తండ్రి కన్నుమూత

Shivashakti Dutta Passes Away: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి (92 )రాత్రి కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, RRR, హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్ రైటర్ గానూ పని చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు.

కోడూరి శివశక్తి దత్తా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించాడు. 1988లో నాగార్జున హీరోగా వచ్చిన ‘జానకి రాముడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో రాణించాడు. స్క్రీన్‌రైటర్‌గా టాలీవుడ్ లో గుర్తింపు పొందారు. సై మూవీలో ‘నల్లా నల్లాని కళ్ల పిల్ల’ , ఛత్రపతి ‘మన్నేల తింటివిరా, రాజన్న ‘అమ్మా అవని’ పాటలు రాశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story