నెగెటివ్ రోల్‌లో మోహన్ బాబు

Mohan Babu: నాని ప్యారడైజ్ (The Paradise) సినిమా నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే (మార్చి 19) సందర్భంగా పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదలయ్యింది.

ఈ సినిమాలో మోహన్ బాబు 'షికంజా మాలిక్' (Shikanja Maalik) అనే అత్యంత క్రూరమైన పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.

దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తిస్థాయి నెగెటివ్ రోల్‌లో నటిస్తుండటం విశేషం. సుమారు 46 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మోహన్ బాబు గారి ఇంటెన్స్ మేకోవర్‌ను చూపించారు. "దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నన్ను మాయ చేశాడు.. అందుకే మళ్ళీ విలన్ గా చేస్తున్నాను" అని మోహన్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఇప్పటి తరం ప్రేక్షకులకు మోహన్ బాబు అసలైన నటన , విలనిజం ఏంటో ఈ సినిమా ద్వారా చూపిస్తానని మాటిచ్చారు.

ఈ సినిమా మొదట మార్చిలో రావాల్సింది, కానీ ఇప్పుడు ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, అంతర్జాతీయ భాషలైన ఇంగ్లీష్, స్పానిష్‌లలో కూడా విడుదలవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story