శికంజా మాలిక్ గా రాబోతున్న కలెక్షన్ కింగ్..

Mohan Babu’s Powerful Avatar in Paradise: లెజెండరీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు చిత్రయూనిట్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు పాత్రకు సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన అత్యంత శక్తిమంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

శికంజా మాలిక్.. ఒక డార్క్ పవర్..

ఈ చిత్రంలో మోహన్ బాబు శికంజా మాలిక్ అనే డార్క్ అండ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఈ తరం ప్రేక్షకులకు అసలు సిసలు మోహన్ బాబు అంటే ఏంటో తెలియదు. ప్యారడైజ్ సినిమాతో ఆయన నటనా విశ్వరూపాన్ని మళ్ళీ చూపిస్తాం అని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమా కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనుండటం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story