Mohanlal's daughter: సినిమాల్లోకి స్టార్ హీరో కూతురు
స్టార్ హీరో కూతురు

Mohanlal's daughter: మలయాళ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ హీరోగా రాణిస్తుండగా ఇప్పుడు ఆయన కూతురు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. స్వయంగా మోహన్ లాల్ తన కూతురి ఎంట్రీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
విస్మయ తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని జూడే ఆంథానీ జోసెఫ్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఇక విస్మయ స్వతహాగా రచయిత్రి, పెయింటర్. నాలుగేళ్ల క్రితం 'గ్రైన్స్ ఆఫ్ స్టార్ డస్ట్' పేరుతో ఓ బుక్ రాసింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ లోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. ఇక ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతోంది. ఇతర నటీన టులు ఎవరు అనే విషయాలను త్వరలో రివీల్ చేయనున్నారు.
మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఆది మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు ప్రణవ్. ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత తుడురుమ్ సినిమాతోనూ ఆడియెన్స్ ను అలరించారు.
