Hridaya Poorvam: మోహన్‌లాల్ హృదయ పూర్వం ఇక ఓటీటీలో.. విడుదల తేదీ ఖరారు
విడుదల తేదీ ఖరారు

Hridaya Poorvam: మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలకు మారుపేరైన నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం హృదయ పూర్వం, ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద విజయం
సత్యన్ దర్శకత్వం వహించిన హృదయ పూర్వం చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మోహన్‌లాల్ నటనకు మంచి ప్రశంసలు దక్కగా, సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
కథా నేపథ్యం
పేరుకు తగ్గట్టుగానే హృదయ పూర్వం కథ ఒక గుండె చుట్టూ తిరుగుతుంది. శ్రీమంతుడైన సందీప్ బాలకృష్ణన్‌కు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. ఆ తరువాత అతను ఒక నిశ్చితార్థ వేడుకకు వెళ్లినప్పుడు, నిశ్చితార్థం చేసుకుంటున్న యువతి, తన గుండెను దానం చేసిన వ్యక్తి కూతురు అని తెలుసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత సందీప్ జీవితంలో ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కథాంశం.
