Monal Gajjar: సంప్రదాయ దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ!
మెస్మరైజ్ చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ!

Monal Gajjar: 'సుడిగాడు' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దేవదాసిలాంటి సినిమాలు చేసింది ఈ చిన్నది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 4లో పా ల్గొన్న ఈ అమ్మడు తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించ లేదు మోనాల్. తెలుగుతో పాటు గుజరాతీ, మలయాళం, తమిళం, హిందీలోనూ నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ప్రశాంతత, సహజమైన అందాన్ని ప్రసరింపజేసే ఒక మనోహరమైన పోస్ట్ ను పంచుకుంది మోనాల్ . లేత గులాబీ రంగు సంప్రదాయ దుస్తుల్లో సున్నితమైన దుపట్టాతో మెస్మరైజ్ చేసింది. నేచురల్ లుక్స్, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. ఈఫొటోలకు కొన్ని రోజులు మీకు ఫిల్టర్లు అవసరం లేదు, మృదువైన దుపట్టా, గాలితో నృత్యం చేసే చిరునవ్వు మాత్రమే' అంటూ క్యా ప్షన్ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మోనాల్.. వెబ్ సిరీస్లు, సినిమాలలో అవకాశాల కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ షో తరువాత మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ కావడం విశేషం.
