మిస్టర్ రెడ్డి జూలై 18న రాబోతోంది.

టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో, నిర్మాత టీఎన్‌ఆర్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో తపన ఉంటేనే సినిమాలు నిర్మిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే గానీ ఓ మూవీ బయటకు రాదు. ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు. నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన కథే. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రాన్ని తీశాం. ఈ ప్రయాణంలో మాకు నిర్మాత, హీరో టీఎన్‌ఆర్ గారు ఎంతో సహకరించారు. మహదేవ్, అనుపమ, దీప్తి అందరూ అద్భుతంగా నటించారు. నాగ భూషణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టీం అంతా కూడా నా స్నేహితులే. అందరం కలిసి ఈ మూవీని తీశాం. రాజన్న ఓ ఫైట్ సీక్వెన్స్‌ను బాగా తీశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

హీరో మహదేవ్ మాట్లాడుతూ .. ‘మా ‘మిస్టర్ రెడ్డి’ కోసం టీఎన్‌ఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీఎన్‌ఆర్ గారికి ధన్యవాదాలు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ టీం అంతా ఓ కుటుంబంలా కలిసి పని చేశాం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ దీప్తి శ్రీరంగం మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి సినిమా. నేను తెలుగమ్మాయిని. మేం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మహదేవ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ మెప్పించేలా ఉంటుంది’ అని అన్నారు.

కెమెరామెన్ నాగ భూషణ్ మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీఎన్‌ఆర్ గారికి థాంక్స్. ఈ చిత్రం బాగా వచ్చింది. అన్ని రకాల అంశాలు ఈ మూవీలో ఉంటాయి. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నటీనటులు : టీఎన్ఆర్, మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు

Updated On 14 July 2025 5:32 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story