సినిమా కావాల్సిందే..?

Mrinal Thakur: శ్రీ సీతారామం, హాయ్ నాన్న మూవీస్ హిట్లతో టాలీవుడ్లో తనకంటూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. కానీ ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడుకు ఛాన్స్ లు రాలేదు. విజయ్ దేవరకొండతో చేసిన ఆ మూవీలో మృణాల్ ఠాకూర్ తన పాత్ర వరకు ఆకట్టుకుంది.

ఇక శృతి హాసన్ తప్పుకోవడంతో అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ లో అవకాశం దక్కించుకుంది. తెలుగులో డెకాయిట్ తప్ప ఆమెకు మరో సినిమా లేదు. అది హిట్ పడితేనే మరో ఛాన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. డెకాయిట్ తర్వాత తెలుగులో సినిమాలేవైనా డిస్కషన్లో ఉన్నాయా అంటే లేదన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో తన మార్క్ సినిమాలు చేస్తూ వెళ్తున్నప్పటికీ.. ఈ అమ్మడికి టాలీవుడ్లో మంచి ఇమేజ్ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మాత్రం ఆఫర్లు రావాలంటే ఆమె ఇంకా ప్రభావం చూపాల్సి ఉంటుంది. కథల ఎంపికలో అచుతూచి వ్యవహరించాలి. అంటే ఆమెకు కచ్చితంగా మరో మంచి జాక్ పాట్ సినిమా కావాల్సిందే..

PolitEnt Media

PolitEnt Media

Next Story