ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..

Charan–Sukumar Film: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఈ ఏడాది మార్చి నెల అత్యంత ప్రత్యేకం కానుంది. రంగస్థలం వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్ళీ జతకడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభానికి సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మార్చి 26న ముహూర్తం.. 27న బర్త్‌డే ట్రీట్..

రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న కాగా దానికి ఒక రోజు ముందే అంటే మార్చి 26న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సుకుమార్ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ వేడుకలో సినిమా టైటిల్ లేదా ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు పుట్టినరోజు కానుకగా అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పెద్ది నుంచి పవర్ ఫుల్ అప్‌డేట్

మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది నుంచి కూడా మార్చి 27న క్రేజీ అప్‌డేట్ రానుంది. ఈ సినిమా టీజర్ లేదా సెకండ్ సింగిల్‌ను ఆ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

డబుల్ సెలబ్రేషన్స్

రామ్ చరణ్‌కు ఇది వ్యక్తిగతంగా కూడా ఎంతో సంతోషకరమైన సమయం. జనవరి 31న ఆయనకు కవల పిల్లలు జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తండ్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన చరణ్, అటు బ్యాక్-టు-బ్యాక్ సినిమా అప్‌డేట్స్‌తో తన అభిమానులకు సరికొత్త జోష్ ఇస్తున్నారు.

సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో రాబోతున్న ఈ కొత్త సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా ఒక సరికొత్త జానర్‌లో ఉండబోతోందని సమాచారం. షూటింగ్ కార్యక్రమాలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story