Rowdy Janardhan: రౌడీ జనార్థన్ కు ముహూర్తం ఫిక్స్
ముహూర్తం ఫిక్స్

Rowdy Janardhan: విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'రౌడీ జనార్దన్' అని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. 'మహానటి' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. రాయలసీమ ప్రాంతంలోని ఒక శక్తివంతమైన, ధైర్యవంతుడైన యువకుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు స్క్రిప్టింగ్ , ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అక్టోబర్ 2న పూజా కార్యక్రమం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ సినిమాపై ఆయన అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఒక ముఖ్యమైన టర్నింగ్ కావచ్చు అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
