సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High Court’s Key Remarks: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుదలపై తెలంగాణ హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదలకు ముందు ప్రభుత్వం జారీ చేసే 'స్పెషల్ మెమోల' ద్వారా ధరల పెంపును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే బహిరంగంగా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందో లేదా అర్థరాత్రో ఉత్తర్వులు జారీ చేయడం వల్ల సామాన్య ప్రజలు లేదా బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండా పోతోందని కోర్టు అభిప్రాయపడింది.

చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా టికెట్ల పెంపు విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానుహోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి.వి. ఆనంద్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ (Contempt of Court) నోటీసులు జారీ చేసింది.కోర్టుకు సమాచారం ఇవ్వకుండానే టికెట్ రేట్ల పెంపునకు మెమో జారీ చేయడంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.సినిమా బడ్జెట్ ఎంత? నిధుల సేకరణ ఎలా జరిగింది? వంటి వివరాలను పారదర్శకంగా వెల్లడించకుండానే ధరల పెంపునకు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా కేవలం 'మెమోల' ద్వారా ధరలు పెంచడం సామాన్య ప్రేక్షకుడిపై ఆర్థిక భారం వేయడమేనని పేర్కొంది.

ఈ తీర్పు టాలీవుడ్ నిర్మాతలలో చర్చకు దారితీసింది, ఎందుకంటే సాధారణంగా సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే బడ్జెట్ లెక్కలు చూసుకుని పెంపునకు దరఖాస్తు చేసుకుంటారు. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం 3 నెలల ముందే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం నిర్మాతలకు సవాలుగా మారనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story