కానీ హీరో అయ్యా - రోషన్

Roshan: శ్రీకాంత్ తనయుడు హీరో రోషన్ త్వరలో ఛాంపియన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన తన వ్యక్తిగత అభిరుచులు, కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాన్న కోరిక

రోషన్ తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, మొదట్లో తనకు నటనపై ఆసక్తి ఉండేది కాదని వెల్లడించారు. "నేను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌ కావాలని కలలు కన్నాను. నాన్న కోరిక కూడా అదే. కానీ కాలక్రమేణా సినిమాలపై ఏర్పడిన మక్కువ నన్ను వెండితెరకు పరిచయం చేసింది" అని రోషన్ చెప్పుకొచ్చారు.

వరుస సినిమాలపై దృష్టి

గత చిత్రాలకు మధ్య కాస్త ఎక్కువ సమయం తీసుకున్న రోషన్, ఇకపై అలా జరగదని స్పష్టం చేశారు. "ఇక నుంచి నా కెరీర్‌లో విరామం తగ్గించాలనుకుంటున్నాను. రాబోయే రెండేళ్లలో కనీసం మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను" అని తన భవిష్యత్తు లక్ష్యాన్ని వివరించారు.

నిర్మాతల అండతో ఛాంపియన్

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లలో పనిచేయడం తన అదృష్టమని రోషన్ అన్నారు. నిర్మాత అశ్వనీదత్ గారితో పాటు స్వప్న, ప్రియాంక దత్ తనను ఒక సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారని ఆయన ఎమోషనల్‌గా తెలిపారు. ఇంతటి గొప్ప బ్యానర్‌లో తనను ఛాంపియన్ గా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రిలీజ్ ఎప్పుడు?

ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story