హేమమాలిని సీరియస్

Hemamalini: ధర్మేంద్ర మరణంపై వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భార్య, నటి హేమమాలిని. అలాంటి ధర్మేంద్ర ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు చికిత్స జరుగుతోందని, ఆయన క్షేమంగా కోలుకోవాలని ప్రార్థించమని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పుకార్లు వ్యాప్తి చేయడం క్షమించరానిది, అగౌరవమైనది అని కూడా ఆమె అన్నారు.

చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన ఛానెల్‌లు ఇలా తప్పుడు వార్తలను ఎలా వ్యాప్తి చేయగలవని ప్రశ్నించారు. ఇది చాలా అగౌరవం, బాధ్యతారహితంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా కుటుంబ గోప్యతకు తగిన గౌరవం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర, హేమ మాలినిల పెద్ద కుమార్తె ఇషా డియోల్ కూడా తండ్రి మరణ వార్త పుకార్లను తోసిపుచ్చారు. మీడియా అతిగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఇషా మండిపడింది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నారని వెల్లడించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story