Nabha Natesh: నాగబంధం ఇప్పటివరకు చేయని సర్ప్రైజ్ క్యారెక్టర్ నాది : నభా నటేష్
నభా నటేష్

Nabha Natesh: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
ఈ సినిమాలో తను 'పార్వతి' అనే ఓ వేద విద్యార్థినిగా కనిపించబోతున్నట్లు నభా తెలిపింది. ప్రేమ కోసం, ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా నిలబడే ఒక స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇదని, ఇప్పటివరకు తను చేసిన పాత్రలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని నభా నటేష్ చెప్పుకొచ్చింది.
దర్శకుడు అభిషేక్ నామా ప్రతి సీన్‌ను స్టోరీబోర్డ్‌తో పాటు కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్‌తో సహా చాలా డీటెయిల్‌గా డిజైన్ చేశారట. ఈ సినిమా కోసం ఏకంగా పది భారీ సెట్లు వేశారు. ముఖ్యంగా అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లో షూటింగ్ చేసేటప్పుడు టీమ్ మొత్తం నియమనిష్టలతో, పూర్తి శాకాహారులుగా ఉండి వర్క్ చేశారని నభా వెల్లడించింది.
సినిమాలో 'నమోరే' సాంగ్‌తో పాటు ఒక జానపద గీతం విజువల్ వండర్‌లా ఉంటాయని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుందని తెలిపింది. హీరో విరాట్ కర్ణకు ఇది రెండో సినిమానే అయినా, ఎంతో అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా నటించాడని ప్రశంసించింది.
నిర్మాతలకు ఇది మొదటి సినిమానే అయినా.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఏకంగా 110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ ఎపిక్‌ను నిర్మించారు. వినూత్నమైన ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ జులై 3న ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి! మరి ఈ సినిమా కోసం మీరెంత మంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.

