Nabha Natesh: తెలుగు చిత్రసీమలో సనాతన ధర్మం, మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. తాజాగా అదే కోవలో వచ్చి థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది సోషియో-ఫాంటసీ డ్రామా ‘నాగబంధం’ (సనాతన జాగరణ). గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎంతో సవాలుతో కూడిన పాత్రలో నభా నటేష్ అద్భుత నటన కనబరిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన సనాతన జాగరణ కృతజ్ఞత కార్యక్రమంలో నభా నటేష్ సినిమా విజయంపై ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మా చిత్ర యూనిట్ అంతా దాదాపు రెండున్నరేళ్లు రాత్రింబవళ్లు కష్టపడింది. ఆ కష్టానికి ఈరోజు తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే శ్రీరంగపురం ఎపిసోడ్, అలాగే రోమాంచితమైన క్లైమాక్స్ సన్నివేశాలకు ఆడియన్స్ థియేటర్లలో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కేవలం ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది” అని అన్నారు.

‘నాగబంధం’ సినిమాను కేవలం ఓటీటీల కోసం కాకుండా, హై టెక్నికల్ వాల్యూస్, రిచ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్‌తో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ప్రత్యేకంగా తెరకెక్కించారు. సనాతన రహస్యాలు, నాగ లోకపు శక్తుల చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అందుకే.. పైరసీని ప్రోత్సహించకుండా, ఈ విజువల్ వండర్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని, సినిమాను మరింతగా ఆదరించాలని నభా నటేష్ కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story