Nadigar Sangam Meets CM Vijay: కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'దళపతి' విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టి సరికొత్త రాజకీయ శకానికి తెరతీశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా..నడిగర్ సంఘం ప్రతినిధులు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.సంఘం అధ్యక్షుడు నాసర్ నాయకత్వంలో హీరో కార్తీ, పూచి మురుగన్, కరుణాస్ తదితర ప్రముఖులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ భేటీలో నడిగర్ సంఘం ప్రతినిధులు సీఎం విజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దానికి ప్రధాన కారణం.. గత కొన్నేళ్లుగా శాంతిభద్రతల పేరుతో నిలిచిపోయిన 'ఎర్లీ మార్నింగ్ షోస్'పునఃప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సినిమా కష్టాలు తెలిసిన వ్యక్తి అధికారంలో ఉంటే నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో విజయ్ నిరూపించారంటూ ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాకుండా, కోలీవుడ్‌లో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలను నాసర్, కార్తీ బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లింది.నిలిచిపోయిన రాష్ట్ర ప్రభుత్వ సినీ అవార్డులను (State Film Awards) ప్రతి ఏటా నిర్వహించాలని కోరారు.చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై సీఎం విజయ్ సానుకూలంగా స్పందిస్తూ.. తమ సొంత గూడైన సినీ పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. తమలో ఒకడు రాష్ట్రానికి నాయకుడు కావడంపై చిత్ర పరిశ్రమ గర్వంగా ఉందంటూ నడిగర్ సంఘం ఈ భేటీని గుర్తుచేసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story