కారణం చెప్పిన నాగ చైతన్య

Naga Chaitanya: అక్కినేని వారసులైన నాగ చైతన్య, అఖిల్.. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు నాగ చైతన్య ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తండ్రి నాగార్జున అండ ఉన్నప్పటికీ తాము స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఆచితూచి అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై నాగ చైతన్య మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

‘‘నాన్న తలుచుకుంటే ఏ డైరెక్టర్‌తోనైనా నేను సినిమా చేసేలా క్షణాల్లో సెట్ చేయగలరు. చాలాసార్లు నన్ను అడిగారు కూడా.. ఎవరితోనైనా మాట్లాడాలా? అని ఆరా తీసేవారు. ఆయన స్టూడియో నుంచి ఒక్క ఫోన్ కాల్ వెళ్తే చాలు. కానీ ఆయన సహకారంతో నటుడిగా వచ్చాక కూడా ప్రతీదానికి ఆయనపైనే ఆధారపడితే మేం సాధించేది ఏముంటుంది? అందుకే సొంతంగా ఎదగాలనుకుంటున్నాం" అని చైతన్య అన్నారు.

నాగార్జునను తప్పుగా అనుకోవద్దని, తమ ఎదుగుదలను కోరుకునే తండ్రిగా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చైతన్య తెలిపారు. చైతన్య మాటలతో అక్కినేని సోదరులు స్టార్ డైరెక్టర్లతో పనిచేయకపోవడానికి కారణం అవకాశాలు లేకపోవడం కాదని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టమైంది.

కెరీర్ అప్‌డేట్స్

ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మైథలాజికల్‌ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల ఆయన నటించిన 'తండేల్' మంచి విజయాన్ని అందుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story