‘Vrushakarma’: నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌పై కీలక అప్‌డేట్.. ఈ సాయంత్రమే ప్రకటన!
ఈ సాయంత్రమే ప్రకటన!

‘Vrushakarma’: అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మ పై కీలక అప్‌డేట్ రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్‌ను ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘విరూపాక్ష’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా అప్‌డేట్స్‌తో ‘వృషకర్మ’పై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది.
కాగా, డిసెంబర్ 3, 2026న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే తేదీని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్నది ఈ సాయంత్రం తేలనుంది. ఒకవేళ అదే తేదీ ఖరారైతే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ తో నాగచైతన్య సినిమా పోటీ పడే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ సినీ రిలీజ్‌లపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమాలో జయరామ్, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి ‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌గా డిసెంబర్ 3నే ప్రకటిస్తారా అనేది ఈ సాయంత్రం క్లారిటీ రానుంది.

