Naga Vamsi: బ్లాస్ట్ జోన్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేయలేకపోయామంటే.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
నాగవంశీ!

Naga Vamsi: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌గా వచ్చి సూపర్ టాక్ తెచ్చుకున్న సినిమా 'బాస్ట్ జోన్'. అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. అయితే, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయామనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. తాజాగా తన కొత్త చిత్రం 'లెనిన్' ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగవంశీ.. దీనికి గల అసలు కారణాన్ని బయటపెట్టారు.
‘బ్లాస్ట్ జోన్’ మూవీకి ప్రచారం చేసే సమయం దొరకలేదని నాగవంశీ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో ‘పెద్ది’ సినిమా విడుదల కావడం.. ఆ చిత్ర నిర్మాత సతీశ్ కిలారు తనకు మంచి స్నేహితుడు కావడంతో క్రాస్ ప్రమోషన్స్ చేయడం కుదరలేదన్నారు. ఒకవేళ ప్రమోషన్స్ మొదలుపెడితే కావాలనే చేశానంటారని, లేదా సినిమాను డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా అని విమర్శిస్తారని నాగవంశీ ఓపెన్‌గా చెప్పారు. 'బ్లాస్ట్ జోన్' మరో రెండు వారాల ముందు వచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ డబ్బులు వచ్చేవి అని.. అయినప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి, ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. ఎందుకో ఇంకా కుదరడం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు."
ఇక థియేటర్లకు ఆడియన్స్ తగ్గడంపై నాగవంశీ సరికొత్త కోణాన్ని విశ్లేషించారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ప్రేక్షకులు తగ్గలేదని.. థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ ధరలకు భయపడే జనాలు రావడం లేదంటూ ప్రాక్టికల్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు రివ్యూలు, రేటింగ్స్ కంటే మౌత్ టాక్‌నే ఎక్కువగా నమ్ముతున్నారని.. దానికి ‘మా ఇంటి బంగారం’ సినిమానే నిదర్శనమన్నారు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. స్టార్ హీరోలు ఏడాదికి ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా చేయాలని కోరారు. అలాగే డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో ఒక రూరల్ కామెడీ మూవీ చేస్తున్నామని.. ఇందులో హీరోకు ఒక డిఫరెంట్ సూపర్ నేచురల్ పవర్ ఉంటుందంటూ నాగవంశీ లీక్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి."

