ఫిబ్రవరి 15న టీజర్ లాంచ్.

‘Nagabandham’ Backed by Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'నాగబంధం' టీజర్ లాంచ్ కాబోతోంది. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మైథాలజికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 11:11 గంటలకు మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు సూపర్ స్టార్ తోడవ్వడంతో చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా కథ 1750 నాటి కాలానికి సంబంధించింది. పురాతన రహస్యాలు, చరిత్ర మరియు పురాణాల కలయికతో 'నాగబంధం' సంప్రదాయం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు, మురళీ శర్మ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ వేసవిలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story