Nagarjuna’s ‘Geethanjali’: ప్రేమంటే కేవలం ఒక భావన కాదు.. అది ఒక అనుభూతి! తెలుగు తెరపై అలాంటి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం 'గీతాంజలి'. మనమధుడు నాగార్జున కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన, ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారి థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది.

కింగ్ నాగార్జున బర్త్‌డే కానుకగా.. ఆగస్టు 29కి ఒకరోజు ముందే, అంటే ఆగస్టు 28న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో అత్యుత్తమ 4K టెక్నాలజీతో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదండోయ్.. ఆ రోజు రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో, ఈ క్లాసిక్ లవ్‌స్టోరీని థియేటర్లలో కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించడానికి మరో అద్భుతమైన అవకాశం కుదిరింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ల్యాండ్‌మార్క్ చిత్రాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

గీతాంజలి' అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది నాగార్జున మోస్ట్ ఛార్మింగ్ అండ్ ఎమోషనల్ లుక్, ఆయన పక్కన గిరిజ అందమైన అభినయం. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తనదైన మ్యాజికల్ స్టోరీ టెల్లింగ్‌తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే.. మాస్ట్రో ఇళయరాజా అందించిన ప్రాణం కరిగించే సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి పాట, ప్రతి ట్యూన్ నేటికీ మన మనసును హత్తుకుంటూనే ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story