రెమ్యునరేషన్ ఎంత? 

Nagarjuna’s Remuneration: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 9కి నాగార్జున సుమారు రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ రెమ్యునరేషన్ సుమారు 50% ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ ఆయనకు ఆరో సీజన్. ఈ సీజన్‌లో మొదటిసారిగా, సామాన్యులకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియను 'అగ్నిపరీక్ష' పేరుతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.సుమారు 40 మంది సామాన్యులను షార్ట్‌లిస్ట్ చేశారు. వీరందరినీ ఒక హౌస్‌లో ఉంచి, వారి మధ్య వివిధ టాస్క్‌లు పెట్టి, అందులో గెలిచిన ఐదుగురిని బిగ్ బాస్ సీజన్ 9లోకి పంపించనున్నారు.ఈ 'అగ్నిపరీక్ష'కి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ శ్రీముఖి ఈ ప్రత్యేక షోకు హోస్ట్ చేయనున్నారు. ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్‌లు ఆగస్టు 22 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతాయి. ఇప్పటివరకు అధికారికంగా కంటెస్టెంట్స్ జాబితా విడుదల కాలేదు. అయితే, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

టీవీ నటి తేజస్విని గౌడ

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మరియు వర్ష

నటి నవ్య స్వామి

నటి జ్యోతి రాయ్

నటి రితు చౌదరి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డెమోన్ పవన్

నటి కల్పికా గణేష్

నటుడు పరంబ్రహ్మ హివ్రాలే

మరికొందరు సామాన్య ప్రజలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story