Nani: న్యాచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం విజయవంతంగా 18 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. 2008 సెప్టెంబర్ 5న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా చిత్రంతో హీరోగా పరిచయమైన నాని, నేడు అగ్ర కథానాయకుడిగా, విలక్షణ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సినిమాల్లో పెద్దవాడినయ్యా.. నాని భావోద్వేగ పోస్ట్

అభిమానుల ప్రేమే బలం

"18 ఏళ్లు.. అధికారికంగా సినిమాల్లో ఇప్పుడు పెద్దవాడినయ్యా" అంటూ నాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రేక్షకులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదని, భవిష్యత్తులోనూ అలాగే కష్టపడి మెప్పిస్తానని స్పష్టం చేశారు.

ది ప్యారడైజ్ తో పాన్-వరల్డ్ లెవెల్‌లో వేట..

ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ శరవేగంగా ముస్తాబవుతోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఇటీవల విడుదలైన టీజర్‌లో నాని పూర్తి రక్తసిక్తమైన రూపంలో, రెండు జడలతో, బ్లేడ్లతో కూడిన గొలుసు పట్టుకుని కనిపించిన విజువల్స్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Next Story