‘Nani – The Paradise’ Release Date: నాని ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా.. కారణం ఏంటంటే?
మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా.. కారణం ఏంటంటే?

‘Nani – The Paradise’ Release Date: నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చిలో రావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు ఆగస్టు రేసులోకి చేరింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొత్త విడుదల తేదీ: ఆగస్టు 21
ది ప్యారడైజ్ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నాని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. నాని ఇందులో
జడల్ అనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 8 భాషల్లో విడుదల చేస్తుండటం విశేషం.
వాయిదా వెనుక బాక్సాఫీస్ వ్యూహం..
విడుదల తేదీని మార్చి నుంచి ఆగస్టుకు మార్చడం వెనుక చిత్ర యూనిట్ ఒక పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 21 తర్వాత వచ్చే మూడు వారాల్లో వరుసగా ఓనం, మిలాద్-ఉన్-నబీ, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు ఉన్నాయి. ఈ లాంగ్ హాలిడేస్ సీజన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడానికి, ముఖ్యంగా పాన్-ఇండియా స్థాయిలో సినిమాను నిలబెట్టడానికి బాగా కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
షూటింగ్ అప్‌డేట్: హై-వోల్టేజ్ మాస్ సాంగ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన హై-వోల్టేజ్ మాస్ నంబర్‌ను నానిపై చిత్రీకరిస్తున్నారు. వందలాది మంది డ్యాన్సర్లతో సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో నానితో పాటు సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ వంటి నటులు నటిస్తున్నారు..

