Nani’s ‘Paradise’: నాని ప్యారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్
ఆయా షేర్ సాంగ్

Nani’s ‘Paradise’: డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు నాని. మంగళవారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘ప్యారడైజ్’ చిత్రం నుంచి ఆయా షేర్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసి తనకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. ‘పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్.. మెట్టు మెట్టు ఎక్కుతర ఆయా షేర్.. పేరు పత్తా లేనోన్నిరా ఆయా షేర్.. ప్యారడైజ్‌కు అడ్రసైత ఆయా షేర్..’ అంటూ సాగిన పాటను కాసర్ల శ్యామ్ రాశారు. అనిరుధ్ కంపోజ్ చేయగా అబ్దుల జంగిరెడ్డి, అర్జున్ ఛండీ పాడారు. శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
మరోవైపు నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ, గ్లింప్స్ విడుదల చేశారు. ‘బ్లడీ రోమియో’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. గ్లింప్స్‌లో నాని క్యారెక్టరైజేషన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. యానిమేషన్ వీడియోలో తనను కిచెన్‌లో చెఫ్‌గా చూపిస్తూ.. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్‌తో చిటికెడు కరుణ, పిడికెడు కోపం లాంటి పదార్థాలను వంటకంగా చూపిస్తూ, తన జీవితాన్ని ఓ మాస్టర్ చెఫ్‌లా ప్రజెంట్ చేశారు. చివరిగా ప్రెజర్ కుక్కర్‌కు టైమ్ బాంబ్ అమర్చి ఇంటిని బ్లాస్ట్ చేయడం హైలైట్‌గా నిలిచింది. వీడియో క్లైమాక్స్‌లో నెంబర్ వన్ చెఫ్ కాదు.. నెంబర్ వన్ గ్యాంగ్‌స్టర్ అని నానిని చూపించడం ఇంప్రెస్ చేసింది. నాని హీరోగా నటిస్తున్న 34వ సినిమా ఇది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

