Oscar Race: ఆస్కార్ రేసులో నరసింహ, కాంతార చాప్టర్ 1
నరసింహ, కాంతార చాప్టర్ 1

Oscar Race: ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో రెండు సినిమాలతో అరుదైన ఘనతను సాధించింది హోంబలే ఫిల్మ్స్. కన్నడలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతున్న ఈ సంస్థ నుంచి 2025లో విడుదలై ఘన విజయం సాధించిన మహావతార్ నరసింహ, కాంతార: చాప్టర్ 1 సినిమాలు అధికారికంగా ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇది భారతీయ సినిమాకు, హోంబలే ఫిల్మ్స్‌కు గర్వకారణమైన క్షణమని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ఈ రెండు చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చేరడం ద్వారా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, -రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన విభాగాల్లో అకాడమీ పరిశీలనకు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ సినిమాల్లో రెండు హోంబలే ఫిల్మ్స్‌వే కావడం విశేషం. మిగతా మూడు చిత్రాల్లో అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘తన్వి ది గ్రేట్’, అభిషన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రాధికా ఆప్టే నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ సైతం ఈ పోటీలో చోటు దక్కించుకున్నాయి.

