Narne Nithin: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్ స్పీడ్ పెంచాడు! శుక్రవారం (జూన్ 19) తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఏకంగా బ్యాక్ టు బ్యాక్ రెండు సరికొత్త ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోయాడు.

ఇందులో మొదటి ప్రాజెక్ట్.. ‘జూనియర్‌‌‌‌’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. నార్నే నితిన్‌ కెరీర్‌లో ఇది 5వ చిత్రం. విశేషం ఏంటంటే.. దళపతి విజయ్‌తో ‘జన నాయగన్‌‌’, రాకింగ్ స్టార్ యశ్‌తో ‘టాక్సిక్‌‌’ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ చూస్తుంటే.. ఇదొక ఫ్రెష్ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రాబోతున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

ఇక ఇదిలా ఉంటే.. నార్నే నితిన్ నటిస్తున్న మరో క్రేజీ సినిమాను కూడా నిన్ననే అనౌన్స్ చేశారు. సుహాస్‌ బాబు దర్శకత్వంలో ఇదొక 'సర్వైవల్ డ్రామా'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రుద్రాన్ష్‌ సెల్యులాయిడ్స్‌’ బ్యానర్‌పై బొమ్మక్‌ శివ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇందులో నార్నే నితిన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక 'బొగ్గు గని కార్మికుడి' గెటప్‌లో పక్కా మాస్ లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

ఒకవైపు లవ్ అండ్ కామెడీ డ్రామా.. మరోవైపు రా అండ్ రస్టిక్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్! ఇలా రెండు విభిన్నమైన కథలతో వస్తున్న నార్నే నితిన్, ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story