Actor Nandamuri Balakrishna: సెట్స్‌లో దిగిన నటసింహం.. సర్జరీ తర్వాత ఫుల్ జోష్‌తో దాదా షూటింగ్‌కు బాలయ్య..
షూటింగ్‌కు బాలయ్య..

Actor Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇటీవల షూటింగ్‌లో గాయపడి, శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి కెమెరా ముందుకు వచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ దాదా షూటింగ్‌లో ఆయన జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.
మైసూరులో కీలక షెడ్యూల్ ప్రారంభం
గతంలో కాకినాడలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ కండరానికి స్వల్ప గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు చిన్న సర్జరీ చేయించుకుని కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో బాలయ్య సెట్స్‌లో అడుగుపెట్టడంతో చిత్ర యూనిట్‌లో సరికొత్త జోష్ నెలకొంది. ప్రస్తుతం మైసూరులో ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక టాకీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తికావడంతో చిత్ర నిర్మాణంలో అతి ముఖ్యమైన భాగం ముగుస్తుందని చిత్రబృందం తెలిపింది.
వీరసింహారెడ్డి కాంబోపై భారీ అంచనాలు
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో దాదాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మాస్, స్టైలిష్ అవతార్‌లో చూపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ ఓ కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
డిసెంబర్ 24న క్రిస్మస్ బరిలో దాదా
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. పక్కా ప్రణాళికతో పనులను పూర్తి చేస్తూ, ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

