National Crush Triptii Dimri: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా, నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి డిమ్రీ.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఆమె ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 23 నుంచి 'స్పిరిట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సరికొత్త షెడ్యూల్‌లోనే త్రిప్తి డిమ్రీ మొదటిసారి షూటింగ్‌లో అడుగుపెట్టబోతోంది. జూన్ ఫస్ట్ వీక్ వరకు సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో.. ప్రభాస్, త్రిప్తి డిమ్రీల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని కీలకమైన రొమాంటిక్ సీన్స్‌ను సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ క్యారెక్టర్ చాలా వైల్డ్‌గా, మల్టిపుల్ షేడ్స్‌తో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ విలన్స్‌గా నటిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు. 'యానిమల్' చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తుండగా, టీ సిరీస్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ 'స్పిరిట్' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story