Natural Star Nani : నాచురల్ స్టార్ నాని.. 17 ఇయర్ ఇన్ ఇండస్ట్రీ
17 ఇయర్ ఇన్ ఇండస్ట్రీ

Natural Star Nani : టాలీవుడ్‌లో నాచురల్ స్టార్ గా పేరుపొందిన నాని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2008 సెప్టెంబర్ 5న విడుదలైన 'అష్టా చమ్మా' సినిమాతో నాని హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నాని వెనుదిరిగి చూడలేదు. వరుసగా విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు.
భీమిలి కబడ్డీ జట్టు (2010): నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. పిల్ల జమీందార్ (2011) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈగ (2012) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా నానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
జెంటిల్‌మ్యాన్ (2016) డ్యూయల్ రోల్‌లో నాని నటన అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. నేను లోకల్ (2017) ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. జెర్సీ (2019): నాని కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 'సరిపోదా శనివారం, టక్ జగదీశ్, 'దసరా' హిట్ 3 లాంటి చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్ సినిమాపై అంచనాలుపెంచాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
