Naveen Polishetty’s Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్
పబ్లిక్ టాక్

Naveen Polishetty’s Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తొలి షోల నుంచి అందుతున్న పబ్లిక్ టాక్ , సోషల్ మీడియా రివ్యూల ప్రకారం సినిమా
ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ప్రధానంగా పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్‌లో కుటుంబంతో కలిసి చూడదగ్గ 'క్లీన్ ఎంటర్‌టైనర్' అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ప్లస్ పాయింట్స్:
నవీన్ తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో సినిమాను భుజాన వేసుకున్నాడు. అతని వన్-లైనర్స్,ఎటకారం పంచులు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి.సినిమా మొదటి భాగం చాలా వేగంగా, ఎక్కడా బోర్ కొట్టకుండా పూర్తిస్థాయి వినోదంతో సాగిందని నెటిజన్లు చెబుతున్నారు. ఒక పెళ్లి చుట్టూ జరిగే సంఘటనలు, ఇతర నటులు (రావు రమేష్, చమ్మక్ చంద్ర) చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. మిక్కీ జే మేయర్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పండగ వాతావరణాన్ని తలపిస్తోంది.
మైనస్ పాయింట్స్:
మొదటి భాగంతో పోలిస్తే సెకండాఫ్ కొంచెం స్లోగా సాగిందని, ప్రీ-క్లైమాక్స్ వరకు కథ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కథలో పెద్దగా ట్విస్టులు లేవు, చాలా సాధారణమైన ప్లాట్‌తో సాగుతుంది.
భారీ బడ్జెట్ సినిమాలు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి పోటీలో ఉన్నప్పటికీ నవీన్ పొలిశెట్టి తన కామెడీతో సంక్రాంతి రేసులో నిలబడ్డారని టాక్. కేవలం వినోదం కోసం సినిమా చూడాలనుకుంటే ఇది మంచి ఛాయిస్.

