‘Anaganaga Oka Raju’ Trailer Released: నవీన్ పొలిశెట్టి ...అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్
అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్

‘Anaganaga Oka Raju’ Trailer Released: నవీన్ పోలిశెట్టి నటించిన "అనగనగా ఒక రాజు" చిత్ర ట్రైలర్ విడుదలైంది. చాలా కాలం తర్వాత నవీన్ తన మార్క్ కామెడీతో మళ్ళీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ ట్రైలర్‌కు కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు" అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటుంది.'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి మళ్ళీ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయారు. ముఖ్యంగా గుడిలోని సీన్లు, పూజారితో సంభాషణలు చాలా ఫన్నీగా ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందం నటనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కొత్తగా సరదాగా ఉంది. గోదావరి జిల్లాల నేపథ్యంలో పెళ్లి చుట్టూ తిరిగే కథ కావడంతో, ట్రైలర్ మొత్తం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది.
మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించారు. సంక్రాంతి రేసులో ప్రభాస్ (రాజా సాబ్), చిరంజీవి (మన శంకరవరప్రసాద్ గారు) వంటి పెద్ద సినిమాలతో పాటు ఈ సినిమా బరిలో ఉంది.సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

