ఫస్ట్ లుక్ రిలీజ్

Mana Shankaravaraprasad Garu Movie: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార పాత్ర పేరు, ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో నయనతార శశిరేఖ అనే పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంటోంది.

దసరా స్పెషల్: రేపు బిగ్ సర్‌ప్రైజ్!

నయనతార లుక్‌తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తన పోస్టులో మరో ముఖ్య విషయాన్ని వెల్లడించారు. దసరా పండగ సందర్భంగా రేపు మరో సర్‌ప్రైజ్ కూడా రాబోతోందని ఆయన అన్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. పండగ రోజున రాబోయే ఆ కొత్త కబురు ఏమై ఉంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. చిరంజీవి, వెంకటేశ్ వంటి అగ్రతారలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుద‌ల చేస్తామని గతంలోనే మేక‌ర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story