Nayanthara: దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో నయనతార ఒకరిగా నిలుస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు తగ్గించినప్పటికీ, సౌత్ ఇండియాలో మేటి హీరోయిన్‌గా తన హవా కొనసాగిస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకని ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం నలభైలలోకి అడుగుపెట్టిన నయనతార, తన కెరీర్‌ విషయంలో ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ (లేడీ ఓరియెంటెడ్) సినిమాలకే పరిమితం కాకుండా, అగ్ర కథానాయకుల సరసన పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే భారీ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో యాక్షన్, నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు.ఆమె తదుపరి చిత్రం కన్నడ స్టార్ యాష్‌తో వస్తున్న “టాక్సిక్”. వచ్చే నెలలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో నయనతార మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

ఇందులో సిగరెట్ తాగే బోల్డ్ పాత్రలో, భారీ యాక్షన్ సీన్లలో నటిస్తున్నారని, ఈ రోల్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.అటు బాలీవుడ్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సల్మాన్ ఖాన్ సరసన ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్‌కి భార్యగా కనిపిస్తున్నప్పటికీ, అది సాధారణ గృహిణి పాత్ర కాదని, కథలో సమాన ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ రోల్ అని తెలుస్తోంది.

కేవలం రొటీన్ హీరోయిన్ ముద్రకే పరిమితం కాకుండా, భారీ బడ్జెట్ చిత్రాలలో పవర్‌ఫుల్ పాత్రల ద్వారా తన కెరీర్‌ను సరికొత్తగా మలుచుకుంటున్నారని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి.నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలో రాణి పాత్ర కోసం మొదట నయనతారను సంప్రదించారు. అయితే కథలో కొన్ని కీలక మార్పులు జరగడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ, ఇండస్ట్రీలో ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ ఉన్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్.

PolitEnt Media

PolitEnt Media

Next Story